- గ్రూపు సభ్యులకు తెలియకుండా పెద్ద మొత్తం లో నగదు బదిలీ
- గ్రూపు సభ్యులపై వడ్డీ భారం మోపిన మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్
- గ్రహించి ప్రశ్నించిన గ్రూపు సభ్యురాలిపై భర్త పై వాగ్వాదానికి దిగిన మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్
- రిసోర్స్ పర్సన్ ఆర్పీ (మెప్మా సిబ్బంది) ప్రేక్షక పాత్ర
- గ్రూపు సభ్యులు అవగాహన రహిత్యం, నిరక్షరాస్యులు అవ్వడమే ప్రధాన కారణం
ప్రకాశం జిల్లా చీమకుర్తి యూనియన్ బ్యాంకు శాఖ-3 సిబ్బంది డ్వాక్రా రుణాల ముసుగులో ఘరానా మోసానికి తెర లేపారు. గ్రూపు సభ్యులకు తెలియకుండా, ఎటువంటి సమాచారం లేకుండా 540000 రూపాయలను M/s శృతి మహిళ పొదుపు గ్రూపు ఖాతానందు రుణం రూపంలో జమ చేసి, సదరు మొత్తానికి నాలుగు నెలల వడ్డీ ఆ గ్రూపు సభ్యులపై మోపారు. బ్యాంకు స్టేట్మెంట్, పదిమంది గ్రూపు సభ్యులను తీసుకొని గ్రూపు సభ్యురాలు అయిన ఇంజాపల్లి దీనమ్మ సదరు బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ లను వివరణ అడుగగా వాగ్వాదానికి దిగారు. కొంతసేపటి తర్వాత వడ్డీ పడిన మాట వాస్తవమేనని, లోను క్లోజ్ చేసే సమయానికి వడ్డీ తగ్గిస్తామని నమ్మబలికారు. గ్రూపు సభ్యులు అందరూ వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వమని అడగగా అందులకు నిరాకరించారు.
ఈ అనధికారిక నగదు బదిలీల వెనుక బ్యాంకు సిబ్బంది అధికార దుర్వినియోగం మరియు గ్రూపు సభ్యులు నిరక్షరాస్యులు అవడం, అవగాహన రహిత్యం మాత్రమే ప్రధాన కారణం అవడం గమనార్హం.
బ్యాంకు వారు చేసిన తప్పిదానికి , తమపై మోపిన అక్రమ వడ్డీలపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు, బ్యాంకు యాజమాన్యం బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సదరు గ్రూప్ సభ్యులు కోరారు.