- ఏజెన్సీలో పీసా గ్రామసభకు లోబడి మద్యం దుకాణాలు నిర్వహించాలి
- సీఎం కు లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు
అల్లూరి జిల్లా – చింతపల్లి : ఏజెన్సీ చట్టాలను ప్రభుత్వం గౌరవించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ఏజెన్సీ ఏరియాలో పీసా చట్టం నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని,మద్యం దుకాణాలు స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం ఒక లేక ద్వారా కోరారు. విలేఖరులకు అందించిన ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను 2024 నుండి 2026 వరకు మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చని గత నెల 30న, డైరెక్టర్ ప్రొబిహిషన్ మరియు ఎక్సైజ్ శాఖ వారు ఉత్తర్వులు జారీచేశాని పేర్కొన్నారు. మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రభుత్వ నోటిఫికేషన్ ను అనుసరించి గిరిజనేతరులు, స్థానికేతర గిరిజనులు ధరఖాస్తులు చేసుకున్నార న్నారు. గిరిజనేతరులు సిండికేట్లుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, సరిహద్దు జిల్లాల నుండి షాపులు దక్కించుకున్నా రన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 దుకాణాలకుగాను సుమారు 2,200 ధరఖాస్తులు ఆశావాహులు చేసుకున్నారన్నారు. దుకాణ లబ్దిదారుల ఎంపిక విషయంలో పీసా చట్టం నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొ న్నారు. ఏజెన్సీ చట్టాలను ప్రభుత్వం గౌరవించలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా గ్రామసభకు లోబడి మద్యం దుకాణాలు నిర్వహించాలని ఏపి పీసా రూల్స్ 2011 రూల్ నెం.4,8-(1) క్లాజ్ -3 (2) సెక్షన్లో పేర్కొన్నారన్నారు. 1996 పీసా చట్టం సెక్షన్ 4 (ఎ)(బి)(డి)(ఇ)(ఎం-1) చట్టం ప్రకారం ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీల ఆచారం, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక న్యాయం మరియు మతపరమైన పద్ధతులు, సామాజిక వనరుల నిర్వహణ, పరిరక్షణ, సాంప్రదాయ పద్ధతులలో వివాదాలు పరిష్కరించుకోవడానికి పీసా చట్టం ప్రకారం, అధికారాలను అమలు చేసుకోవడంతో పాటు లబ్దిదారులను ఎంపిక చేయు అధికారం, మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అంతిమ అధికారాలు పీసా గ్రామసభకు మాత్రమే కలిగివున్న దన్నారు. ఇట్టి విషయంలో పీసా గ్రామసభ ఆమోదం, తీర్మానం అత్యంత కీలకమైన దన్నారు. అందువల్ల చట్ట విరుద్దంగా ఏజెన్సీ ఏరియాలో అమలు చేస్తున్న మద్యం షాపులు వేలం రద్దు చేయాలని ఆయన కోరుతున్నానన్నారు. పీసా గ్రామ సభకు మద్యం దుకాణాలు వినియోగం, అనుమతి విషయంలో సెక్షన్ 3 క్లాజ్ -1, సెక్షన్ 8 క్లాజ్ -1 ప్రకారం ప్రత్యేకమైనదని, అంతిమమైనదన్నారు. కావున పీసా చట్టం సెక్షన్ 4 క్లాజ్- డి, ఎన్ ప్రకారం గ్రామసభకు శాసనపరమైన స్వయంపాలన అధికారం కలిగివున్నదన్నారు. ఏజెన్సీ పరిధిలో సెక్షన్ 8 క్లాజ్ -11 ప్రకారం మద్యం దుకాణాల లైసెన్సు స్థానిక గ్రామసభ పరిధిల్లోనే స్థానిక గిరిజనులకు మాత్రమే మంజూరు చేయాలని,సెక్షన్ 3 క్లాజ్ -11 ను అనుసరించి ఏజెన్సీ గ్రామ ఆచారాలు, సంస్కృతి,సాంప్రదాయాలు, కట్టుబాట్లు ప్రకారం మద్యం దుకాణాల కోసం వచ్చిన ధరఖాస్తులను పరిశీలన చేసి పరిధిలోనే లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. అర్హత కలిగిన ధరఖాస్తు దారులను గ్రామసభకు తెలియపర్చడం తో పాటు మద్యం దుకాణాల విషయంలో గిరిజనులకు లైసెన్స్ గ్రామసభ పరిధిల్లోనే ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నామన్నారు. ఏజెన్సీ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలా?వద్దా? అనే అంశాన్ని పీసా గ్రామసభ సమక్షంలో చేతులు ఎత్తటం ద్వారా మెజార్టీ ఓటింగ్ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ఆ లేఖ లో కోరారు.