అనంతపురం జిల్లా సరిహద్దు గుత్తి పట్టణ శివారులోని బాట సుంకలమ్మ ఆలయం వద్ద ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆధ్వర్యంలో ఆహుడా చైర్మన్ టి సి వరుణ్ కు ఘన స్వాగతం పలికారు. మొట్టమొదటగా జిల్లాకు చెందిన జనసేన నాయకుడు వరుణ్ కు ఆహుడా చైర్మన్ పదవి దక్కడంతో ఎన్డీఏ కూటమి నాయకుల ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బాట సుంకలమ్మ ఆలయంలో హుడా చైర్మన్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ప్రజలకు విధితమే ఉమ్మడి జిల్లాలో ఎన్డీఏ కూటమి నాయకులతో మమేకమై అక్రమాలను వెలికి తీస్తామని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసినందుకు తగిన గుర్తింపు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర బిజెపి పార్టీ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.