సిపిఎం ప్రజా క్యాంపెయిన్ లో భాగంగా గుత్తి ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి.నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వం ట్రూ యాప్ చార్జీల పేరుతో ప్రజల పైన భారాలు వేయడాన్ని ఉపసంహరించుకోవాలని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని సూపర్ సిక్స్ లో భాగంగా ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని, మద్యం నియంత్రణంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని జిల్లాలోని సాగునీరు ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో 7 వేల కోట్లు నిధులు కేటాయించాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఉద్యోగుల తొలగింపు ఆపాలి పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జమిలి ఎన్నికల ప్రతిపాదనను విరమించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమేష్ సిఐటియు మండల అధ్యక్షులు మల్లేష్ మహిళా సంఘం నాయకులు రేవతి సిపిఎం నాయకులు మారి రాము తదితరులు పాల్గొన్నారు.