అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లోశుక్రవారం ప్రముఖ పురాతనమైన సీఎస్ఐ చర్చ్ శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న శతజయంతి ఉత్సవాలు శుక్రవారం ఉదయం చర్చిలో గుత్తి పట్టడానికి చెందిన వివిధ చర్చిల ఫాదర్ల ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు 100 సంవత్సరాల కాలంలో సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్య వైద్యం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను సిఎస్ఐ సంస్థ నిర్వహించిందని గుర్తు చేసుకున్నారు. సిఎస్ఐ చర్చ్ ఎల్లప్పుడు సమాజంలో శాంతిని నెలకొల్పటానికి ప్రజల మధ్య మానవ సంబంధాలు ప్రేమాభిమానాలు పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ప్రార్థన అనంతరం చర్చి ప్రాంగణంలో డప్పులు మేళతాళాలు చక్క భజనలతో ఊరేగింపు ప్రారంభమైంది. సిఎస్ఐ చర్చి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అమృత టాకీస్ రోడ్డు గాంధీ చౌక్ రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి తిరిగి ఆర్టిసి బస్టాండ్ మీదుగా ఆర్ అండ్ బి బంగ్లా ఎన్టీఆర్ సర్కిల్ కటిక బజారు మీదుగా తిరిగి చర్చి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో గుత్తి సీఎస్ఐ చర్చ్ పాలకవర్గ సభ్యులు విజయ్ కుమార్ రసల్ కిరణ్ జోయల్ మనో రంజిత దయానంద్ కిరణ్ బాబు తో పాటు పట్టడానికి చెందిన వివిధ చర్చిలకు చెందిన పలువురు ప్రసంగీకులు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.