అనంతపురం జిల్లా గుత్తి పట్టణం వసుధ ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు దాడులు నివారించడానికి రాజ్యాంగం కల్పిస్తున్న చట్టాలపై అవగాహన సదస్సు జరిగినది. ముఖ్యఅతిథిగా గుంటకల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు విచ్చేయగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సులో అధ్యక్షత వహించిన సిఐడి ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల ఉప కులాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న చట్టాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని, సమాజము లోని ప్రతి కులం వారికి సంఘంలో తగిన ప్రాధాన్యత కల్పించి సాటి మనుషులుగా గౌరవించాలన్నారు. అంతేకాకుండా ఎస్సీ , ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తుల పై దాడులు జరిగితే వారికి ప్రభుత్వాలు అమలుపరుస్తున్న ప్రత్యేక చట్టాలపై అవగాహన కలిగి ఉండి రెవెన్యూ , పోలీసులు ద్వారా న్యాయ సేవలు పొందాలన్నారు.
ఈ సదస్సుకు హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు చట్టాలపై రాత పరీక్ష నిర్వహించి రథమ ద్వితీయ తృతీయ స్థానాలకు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి సీఐ వెంకటేశ్వర్లు, గుత్తి డివిజన్ ఏ ఎస్ డబ్ల్యూ ఓ రాధిక, గుత్తి ఎంపీడీవో శివాజీ రెడ్డి , గుత్తి ఎంఈఓ రవి నాయక్, సిఐడి సీఐ వై శ్రీనివాస రావు, సిఐడి ఎస్ఐలు శంకర్ నాయక్, ఉస్తాన్ గని, శ్రావణి, సిఎస్ శివ, వీఆర్వో సురేంద్ర, ఎస్సీ ఎస్టీ కులాల సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు