భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం: కరోనా-2019 కారణంగా వచ్చిన లాకౌట్ వల్ల ఆదాయం లేక సరైన ఆర్థిక సహాయం అందక అవస్థ పడుతున్న మారుమూల గ్రామాల్లో ఉండే రోజువారీ కూలీలకు సహాయం చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టిన చర్ల 2001 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు. ఈ కార్యక్రమంలో భాగంగా చర్ల మండలంలోని సరైన రహదారులు కూడా లేని బక్కచింతలపాడు మరియు కొండివాయి గ్రామాల్లోని 110 కుటుంబాలకు సుమారు నలబై వేల రూపాయల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది.