contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి పోలీసు గూండాగిరి – లాక్ డౌన్ పేరుతొ ఆర్మీ జవాను పై దాడి

కర్నూల్ జిల్లా దేవనకొండ కు చెందిన ఆర్మీ జవాను లక్ష్మన్న ను అతి దారుణంగా కొట్టిన వైనం  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ….

వివరాల్లోకి వెళితే జమ్మూ కాశ్మీర్ లో విధులునిర్వహిస్తున్న జవాను లక్షమ్మన్న సెలవు లో రావడం జరిగింది , సెలవు అయిపోయి విధులకు వెళ్లాల్సిన లక్ష్మన్న లాక్ డౌన్ వలన వెళ్లలేక పోయాడు . గత శుక్రవారం అనగా ఏప్రిల్ 17 న తన తల్లి ఆరోగ్యం బాగాలేక , అలాగే తనకి కూడా బైక్ సైలెన్సర్ తగిలి గాయమైతే మందుల కోసం మెడికల్ షాప్ కి వెళుతుంటే లాక్ డౌన్ పేరుతొ  దేవనకొండ ఎస్సై మారుతి  మరియు ఇద్దరు కానిస్టేబుల్స్ దూషించడం తో పాటు , రక్తాలు కారేటట్టు కొట్టారు .  నేను ఆర్మీ జవానునని చెప్పిన … మా అమ్మకి ఆరోగ్యం బాగోలేక మందులకు కోసం వెళుతున్నానని చెప్పినా  వినకుండా ఎస్సై మారుతి , కానిస్టేబుల్స్ అశోక్ , మంజునాథ్ లు తిడుతూ మొఖం మీద  పిడిగుద్దులు  గుద్దారు . నేను ఆర్మీ జవానునని చెప్తుంటే  … నువ్వు ఎవడివైతే మాకేందిరా అంటూ … ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ స్టేషన్ కి తీసుకెళ్లి అతి దారుణంగా రక్తాలు కారేటట్టు కొట్టారు . కొట్టిన ఎస్సై మారుతి పారిలో ఉన్నాడు .

1 . ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది … ఆర్మీ జవానుని కొట్టే అధికారం పోలీసులకు ఉందా?

2 . లాక్ డౌన్ 144 సెక్షన్ ప్రకారం ఎవరినైనా సరే  కొట్టే అధికారం ఉందని పోలీసులు చెప్తూ  రెచ్చిపోతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు ఇది ఎంతవరకు చట్టిపరిధిలో  ఉంది ???

౩. ప్రోటోకాల్ ప్రకారం నిజానిగా ఒక  ఆర్మీ జవాను తప్పు చేసి ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకోని పోలీసు ఉన్నతాధికారులులకు సమాచారం ఇస్తే వారు ఆర్మీ ఉన్నతాధికారులకు  సమాచారం ఇస్తే  వారు వారి సిబ్బందిని పంపి అదుపులోకి తీసుకోని విచారణ జరిపి శిక్షిస్తారు . అంతే కానీ కొట్టే అధికారం పోలీసులకు లేదు
 

జరిగిన సంఘటన పై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవటం గమనించదగ్గ విషయం .. ఇకనైనా రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి జవాన్ పై దాడి చేసిన ఎస్సై మారుతి , కానిస్టేబుల్ అశోక్ , మంజునాథ్ ల పై చట్టపరమైన చెర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు ..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :