బాడంగి మండలం, విజయనగరం జిల్లా: ప్రపంచ టాయిలెట్స్ డే (World Toilet Day) సందర్భంగా, బాడంగి మండల కార్యాలయంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో, స్కూల్ పిల్లలు, వెలుగు ప్రాజెక్ట్ సిబ్బంది, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు అందరూ పాల్గొని ఈ దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ZPTC, ఎంపీటీసీ మరియు బాడంగి గ్రామ సర్పంచ్ ముఖ్యంగా పాల్గొని, భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా “ప్రతి వ్యక్తి మరుగుదోడ్లు ఉపయోగించాలి” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో, ప్రతి ఒక్కరికి ప్రత్తిజ్ఞ చేయించబడింది. ప్రతిజ్ఞ ప్రకారం, ఎవరైతే వ్యక్తిగత మరుగుదోడ్లను ఉపయోగించకపోతే, వారు కమ్యూనిటీ శానిటరీ కంప్లెక్స్ ఉపయోగించుకోవాలని సూచించారు.
అలాగే, మరుగుదోడ్లు లేకపోతే వెంటనే మరుగుదోడ్లు మంజూరు చేయబడతాయని, మరియు అందుకు సంబంధించి ప్రజలకు పూర్తి సహాయం అందించబడుతుందని స్థానిక అధికారులు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమాలు డిసెంబర్ 10 వరకు నిర్వహించబడతాయి. ప్రతి రోజూ గ్రామ పంచాయతీ స్థాయిలో, ప్రజలకు మరుగుదోడ్ల అవసరం మరియు ఆరోగ్యకరమైన శానిటేషన్ గురించి అవగాహన కల్పించటం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, మరియు పలు గ్రామ పంచాయతీల ప్రతినిధులు పాల్గొన్నారు.