బి. కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం,సందర్భంగా మండల బాలసానిపల్లి పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచం బాలల హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొని పిల్లలకు జీవించే హక్కు,రక్షణ హక్కు,అభివృద్ధి హక్కు,భాగస్వామ్యపు హక్కు తదితర అంశాలపై వివరించారు.అనంతరం బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అంగన్వాడీ టీచర్ మరియు బాలబాలికలు పాల్గొన్నారు.