పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నుండి వచ్చిన ఫిర్యాదుకు స్వయంగా విచారణ చేపట్టి పరిష్కారం చూపారు. వివరాల్లోకి వెళితే ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఎడ్లూరి వెంకట్రావు తన కుమారుడు నాగరాజు ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని గొడవ పడుతూ తన ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ కి ఫిర్యాదు చేయడంతో, ఎస్పీ శ్రీనివాస రావు స్వయంగా బాధితుడి గ్రామానికి వెళ్ళి .. వెంకట్రావు అతని కుమారుడు నాగరాజుకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో తండ్రి కొడుకుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయి.
ఒక సామాన్యమైన వ్యక్తి తనకు కలిగిన ఇబ్బందిని జిల్లా పోలీసు అధికారికి తెలియపరచగా స్వయంగా వెళ్ళి విచారించి కొన్ని సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యను పరిష్కరించినందుకు ఎడ్లపాడు గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు మరియు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేసారు. ఒక జిల్లా ఉన్నతాధికారి స్థాయిలో ఉన్న ఎస్పీ శ్రీనివాస్ రావు సామాన్యుడి ఇంటికి వెళ్ళి సమస్యని పరిష్కరించడం ఇదే మొదటిసారి.