మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మణపల్లీ గ్రామంలో ఉన్న పిపిసి (పని పర్చేజ్ సెంటర్) కేంద్రాలలో వడ్ల కొనుగోళ్లను సకాలంలో, సమర్థంగా నిర్వహించేందుకు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో భాగంగా, జయచంద్ర రెడ్డి అధికారులను ఉద్దేశించి కొన్ని కీలక సూచనలిచ్చారు. “ఎప్పటికప్పుడు లారీలు ఆన్లోడింగ్ చేయించి, వడ్ల కొనుగోళ్లను వేగవంతంగా, ఎలాంటి గడువు పొడిగింపు లేకుండా పూర్తి చేయాలనీ, అలాగే ట్యాబ్ ఎంట్రీలు త్వరగా పూర్తి చేయాలని” ఆయన ఆదేశించారు.
అంతేకాకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సేవలను సులభంగా, సమర్ధవంతంగా అందించాలని జయచంద్ర రెడ్డి అధికారులను కోరారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ, “ఇప్పటివరకు తూప్రాన్ డివిజన్ మొత్తం లో 792 లారీల ఆన్లోడింగ్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం 2,25,599 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం కూడా విజయవంతంగా జరిగింది” అని వెల్లడించారు.