ఛత్తీస్గడ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 10మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా అనేక ఆయుధాలను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నిన్న ఒరిస్సా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.