ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం శాంతినగర్ సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ని వెనక నుంచి కారు ఢీ కొట్టిన సంఘటనలో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు ఖాజా బాషా, ఇర్ఫాన్ ఖాన్ ,అల్తాఫ్ మాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరూ కర్నూలు కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరు వ్యక్తిగత పనులపై ఒంగోలుకు వచ్చి తిరిగి కర్నూలుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.