పిఠాపురం : విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నందు – ఆర్ట్స్ మరియు అమరావతి ఫౌండేషన్ వారు నిర్వహించిన శత కవుల సమ్మేళనంలో అమ్మ అనే శీర్షికతో కవిత చదివి అందరి మనసులు ఆకట్టుకున్నందుకు గాను సంస్థ వ్యవస్థాపకులు కళారత్న డా.పొట్లూరి హరికృష్ణ మరియు ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి తదితర పెద్దలు గౌరవనీయులు అభినందించి యువ కవయిత్రి భానుని సత్కరించారు. యువత కళారంగంలో ముందు ఉండాలని, భాను చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు.