విజయనగరం జిల్లా: బాడంగి మండల కేంద్రంలో గల దివ్యాంగుల భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మండల విద్యాశాఖధికారి లక్ష్మణ దొర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం అనేక విద్యా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని భవిత కేంద్రంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ వీరికోసం ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించిందని వాటిని దివ్యాంగ్యులందరూ సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం దివ్యాంగులు వారి తల్లిదండ్రులు అవగాహనా ర్యాలీ నిర్వహించి వివిధ క్రీడలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొల్లి ఈశ్వరరావు, పాపారావు, ఐఈఆర్పీ సత్యన్నారాయణ, సరిత, ఉపాధ్యాయులు ఉడుముల లక్ష్మి, రహీం పాల్గొన్నారు.
