మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రామాయంపేట సీఐ వెంకట రాజం గౌడ్ తెలిపారు. బీహార్ నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్నశంకరంపేటలో విక్రయాలు చేస్తున్నట్టు సమాచారంతో మాటు వేసి గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నారు పోలీసులు . ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట, చేగుంట ఎస్సైలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.