contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి

ఢిల్లీ : దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆందోళనతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో మంగళవారం ఈమేరకు కేంద్ర వ్యవసాయ మంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ‘దేశం మారుతుండడం తొలిసారి చూస్తున్నా.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలలు కనడం కాకుండా దానిని లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. దేశం ఉన్నత శిఖరాలవైపు పయనిస్తోంది. అయితే, రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకెక్కి తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దేశంలో రైతు మాత్రమే అసహాయుడిగా మిగిలిపోతున్నాడు. అసలేం జరుగుతోంది?’ అంటూ మంత్రిని ధన్ ఖడ్ ప్రశ్నించారు.

రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి.. వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నామని ధన్ ఖడ్ నిలదీశారు. రైతులు గతేడాది ఆందోళన చేశారు.. ఈ ఏడాది ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఉపరాష్ట్రపతి ప్రశ్నలకు చౌహాన్ మౌనాన్ని ఆశ్రయించారు. గత పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ హైకమాండ్ కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని వ్యవసాయ శాఖను అప్పగించిన విషయం తెలిసిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :