కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువు ఒక్కటే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని, కాబట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు సూచించారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)