పిఠాపురం : కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీశ్రీశ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు సాయి ప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు & జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నందు గల సరస్వతిదేవి, అంజనేయస్వామి వార్లును దర్శించుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. 14వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుచున్న 10వ సప్తాహ మహోత్సవ భజన కార్యక్రమంలో పాల్గొని, అన్నసంతర్పణకు విరాళంగా రూ.5వేలు దాసరి లోవరాజుకు అందజేశారు. అనంతరం ఆలయ ప్రోత్సాహికులు దాసరి లోవరాజును జ్యోతుల శ్రీనివాసు పూలమాల వేసి, శాలువతో ఘనంగా సన్మానించి, సాయి ప్రియ సేవాసమితి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ శంఖవరం గ్రామం ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందిన గ్రామమని, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్మాణం జరిగి నేటికి 14 సంవత్సరాలుకాగా, అప్పటినుంచి ఆలయ మహోత్సవాలు నిర్విరామంగా ఇంత ఘనంగా నిర్వహించడంలో దాసరి లోవరాజు ప్రోత్సాహం, కృషి ఎంతో వుందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు దాసరి లోవరాజు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహాదారు సభ్యులు మేకల కృష్ణ, దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కందా శ్రీనివాస్, సాయి ప్రియ సేవా సమితి కోశాధికారి పేకేటి వెంకటరమణ, జ్యోతుల సీతరాంబాబు, వెలుగుల రాంబాబు తదితరులు పాల్గొన్న అందజేశారు.
