తెలుగులోని యాక్షన్ హీరోల్లో గోపీచంద్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా ఏ అంశాలు ఉన్నప్పటికీ యాక్షన్ పాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సారి ఆయన కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా కనిపించనుంది.కబడ్డీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కథా పరంగా యాక్షన్ .. ఎమోషన్ ఎక్కువగా వుంటాయనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందని చెబుతున్నారు.