ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు సాకే హరి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి మహేష్ యువజన అధ్యక్షులు చుట్టా బాబు ఆధ్వర్యంలో మహనీయుడు దళితుల ఆశాజ్యోతి దళిత కిరణం ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలకు ఎన్నో హక్కులు కల్పించినటువంటి మా ఆరాధ్య దైవం మా దేవుడు మాకోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అమర్‌రహే అంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో తాలూకా నాయకులు చుట్ట రాజా చుట్ట నరసింహులు శేష పెద్దిరాజు నాగేంద్ర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.