సంగారెడ్డి జిల్లా : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ,మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగారెడ్డి మహిళ పోలీస్ స్టేషన్ ను కిశోర బాలికలు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని కే లలిత కుమారి మాట్లాడుతూ బాలికలు శిశు సంక్షేమ శాఖ నుంచి అందిస్తున్న సేవలను మరియు అవగాహన కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది. సరైన పోషకాహారం తీసుకుని మంచి ఆరోగ్యంతో పాటు విద్యను అభ్యసించి ఉన్నత అభివృద్ధి సాధించాలని సూచించారు.హెల్ప్ లైన్ నెంబర్స్ 1098 , 181 ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ప్రమీల మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలను మరియు చట్టాలను ,శిక్షలను వివరించారు.18 సంవత్సరాలలోపు బాల బాలికలు విద్య మీద దృష్టి పెట్టాలి అని సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా వుండాలి అని తెలియ జేశారు.100 నెంబర్ నీ ఉపయోగించుకోవాలి అని సూచించారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ సునీత బాయ్, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం సమన్వయ కర్త పల్లవి , సఖి CA కల్పన, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు,భరోసా సమన్వయ కర్త దేవా లక్మి,పోలీస్ ఉమెన్ శాఖ సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని కె లలిత కుమారి మరియు విద్యార్థినులు భరోసా సెంటర్ సందర్శించడం జరిగింది.