కరీంనగర్ జిల్లా: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకొని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం గన్నేరువరం మండలకేంద్రం నందు దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గన్నేరువరం ఎంఈఓ కె. రామయ్య మాట్లాడుతూ ఇలాంటి దివ్యాంగుల తల్లిదండ్రులు పిల్లల గురించి కలత చెందవద్దని వీరి సంరక్షణ కొరకు భావిత కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శిరీష, తదితరులు పాల్గొన్నారు.