అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కార్యక్రమమైన పేరెంట్స్ టీచర్స్ డే అట్టహాసంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్, గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ, చెర్లోపల్లి గ్రామంలో గల సేవాగడ్ గురకుల పాఠశాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్‌ను ఉపాధ్యాయులతో కలిసి మమేకం చేయించడం అద్భుతమైన ఘట్టం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకే, ఈ అనుబంధాన్ని శక్తివంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబరు 7న ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ విశాలాక్ష్మి, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, ఎంఈఓ రవి నాయక్, సీఐ వెంకటేశ్వర్లు, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎం కె చౌదరి, ఎర్రగుడి రమేష్, జక్కలచెరువు ప్రతాప్, ఎంపీ భాషా, చికెన్ శ్రీనివాసులు నగదానిసత్య, చెరుకూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.