కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం ఎన్నికల్లో కొమరం భీం జిల్లా అధ్యక్షుడిగా గుండా శ్యామ్ గెలుపొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి తో కలసి శనివారం హైదరాబాదులోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. జిల్లా అధ్యక్షుడిగా గెలుపొందడంతో సీఎం అభినందించారని, మరింత ఉత్సాహంతో పార్టీని పటిష్టం చేయాలని, ప్రభుత్వం చేపడుతున్నసంక్షేమం ,అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించినట్లు శామ్ తెలిపారు.