కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మన తెలంగాణ రిపోర్టర్ మ్యాకల సుధాకర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు సుధాకర్ రెడ్డి కుటుంబం నిరుపేద కుటుంబం మానవత దృక్పథంతో గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ తనవంతుగా 50 కిలోల బియ్యాన్ని సుధాకర్ రెడ్డి కుటుంబానికి అందజేశారు
నీతి నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరుగుతా లేదని జర్నలిస్ట్ కుటుంబాల్లో కూడా నిరుపేద కుటుంబాలను గుర్తించి ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులపై నాయకులపై ఉందని గన్నేరువరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు రాజ్ కోటి అన్నారు