పిఠాపురం : కె.ఎస్.ఈ.జెడ్ భూములు ఎవరు అవినీతి చేసారో తేల్చుకుందాం అంటూ వైపాక నాయకులకు సవాల్ విసిరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ వైకాపా నాయకులు తన సవాల్ ను స్వీకరించకపోవడం చాలా దారుణమన్నారు. సెజ్ భూముల వ్యవహారంలో టిడిపి నేతలపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు తాను చేసిన సవాల్ ను ఎందుకు స్వీకరించలేదు అనే విషయం పత్రికా ముఖం ద్వారా తెలియజేయాలన్నారు. కాకినాడ సెజ్ వ్యవహారంపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత విమర్శలు చేయడంకాదని, ఆ విమర్శలను నిరూపించాలని లేనిపక్షంలో తాను బహిరంగ చర్చకు రమ్మన్న విషయంపై వాళ్లు ఎందుకు స్పందించలేదు తెలియజేయలన్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే వర్మ తన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వరకు పాదయాత్రగా విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ఆయన బైఠాయించారు. సవాల్ ను స్వీకరిస్తే వచ్చే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కాకినాడ మసి పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశారు. వారి రాక కోసం రెండు గంటలు వేచి చూసిన వర్మ, టిడిపి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.