హైదరాబాద్ : నవోదయ కాలనీ లో ఉన్న హిందూ దేవాలయానికి భక్తులను రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీనివాస్ రెడ్డి అలియాస్ పెద్ద అనే వ్యక్తి ఇష్టానుసారంగా భూతులు తిడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి గూడా, నవోదయ కాలనీ, గణపతి కాంప్లెక్స్ వెనక భాగంలో శ్రీ సౌడమ్మ మల్లికార్జున దేవాలయం ఉంది. ఆ దేవాలయ చరిత్ర చూసినట్లయితే సుమారు వంద సంత్సరాల చరిత్ర ఉన్నట్టు సమాచారం. అయితే కొందరు ఆంద్రోళ్ళు ఆ దేవాలయ స్థలాన్ని కబ్జా చేయాలనీ పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు పలు ఆరోపణలు లేకపోలేదు. అయితే ఆ దేవాలయాన్ని ఒక పేద కుటుంబానికి చెందిన వారు గత వందేళ్లుగా ఆ దేవాలయంలో పరిచర్యలు చేస్తున్నారు. ఆ దేవాలయాన్ని నమ్ముకొని అక్కడే ఉంటున్నారు.
అయితే పెద్ద అనే వ్యక్తి ఆ దేవాలయం వైపు ఎవరు రాకుండా, వచ్చిన భక్తులను తిడుతూ .. చంపేస్తా, పొడిచేస్తా .. నరికేస్తా అంటూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఆ దేవాలయానికి భక్తులు రావాలంటేనే స్థానికులు భయపడుతున్నారు.
అంతేకాక పక్కన ఇస్త్రీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్న ఇస్తి బండి టేబుల్ విరగ్గొట్టి దాడి కి పాలుపడ్డట్టు కింద టేబుల్ ఫోటో చుస్తే తెలుస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కాసులకు కక్కుర్తిపడి కేసులను నీరుగారుస్తున్నారే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఈరోజు ఉదయం కొందరు మీడియా సంబంధించిన వారు గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటుండగా వారిని భయాందోళనకు గురి చేసాడు. నోటికొచ్చిన భూతులు తిడుతూ వారిపై విరుచుకుపడ్డారు. దీంతో బాధితులు జూబిలీహిల్స్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
గతంలో పెద్ద పై బంజారాహిల్స్, జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనట్టు సమాచారం. దేవాలయ భూములను కబ్జా చేయాలనీ గాని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లేదా, దేవాలయం జోలికి ఎవరైనా వెళ్లినా సరే రిపోర్టర్ టివి న్యాయ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. పూర్తి వివరాలతో మరో వార్తతో మీ ముందుకొస్తాం .