- పోటీలను ప్రారంభించిన తాసిల్దార్ ఇప్ప నరేందర్
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను తాసిల్దార్ ఇప్ప నరేందర్ ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతి యువకులు క్రీడా ప్రతిభను వెలికి తీయటానికై ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ఈ పోటీలలో మొదటి రోజు కోకో ను మొదటి క్రీడాగా పోటీ నిర్వహించారు. ఈకార్యక్రమం లో తాసిల్దార్ ఇప్ప నరేందర్, ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ కే.రామయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు బొడ్డు సునీల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.