కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న అధ్యక్షతన మాజీ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ పత్రికా మీడియా మిత్రుల సమావేశానికి హజరైనారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాజీ ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టు చీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు ఉండేవని కోహినూర్ వజ్రంతో కిరీటంతో పాటు వడ్డాణం, జరీ అంచుచీర, నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక విగ్రహం రూపురేఖల్లో మార్పులు చేర్పులు చేశారని ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉందని, అయితే ఇందులో బతుకమ్మ కనిపించలేదని అన్నారు. విగ్రహ నమూనా బయటికొచ్చినప్పటి నుంచే ఇది తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అని వాదిస్తూ వచ్చింది అని అన్నారు. తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారని అన్నారు. తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదని తెలంగాణ తల్లి మన ఉద్యమాల కేతనం, మన స్వాభిమాన సంకేతం అని అన్నారు. తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీక అని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమేనని అన్నారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంప వెంకన్న,మాడుగుల రవీందర్ రెడ్డి,న్యాత సుధాకర్,గుడెల్లి ఆంజనేయులు,బోయిని అంజయ్య,లింగాల మహేందర్ రెడ్డి,గొల్లపల్లి రవి,అట్టికం శ్రీనివాస్, గూడూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.