ఎస్సీ వర్గీకరణ అమలుకై మర్రిపాడు మండలంలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఎస్సీ సంక్షేమ హాస్టల్ నందు మండల స్థాయి సమావేశం ఎం.ఎం.ఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు వడ్లపల్లి రమణమ్మ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కొరకు ముప్పై సంవత్సరాలనుండి అలుపెరుగనిపోరాటం చేసి ఈ దేశ అత్యున్నత నాయస్థానం సుఫ్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటానికి నిదర్శనం అని అలాంటి నాయకుని నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందని ఎస్సీ వర్గీకరణ పై, మాలల లో కొంతమంది చేస్తున కుట్రను మాదిగలు తిప్పికొట్టాలని అందుకు మాదిగలు గ్రామస్థాయిలో ప్రతీ మాదిగ విధ్యార్ధి ఉధ్యమంలో భాగస్వామ్యం కావాలని అధేవిధంగా మందకృష్ణ మాదిగ నెల్లూరు జిల్లా పర్యటన ఎప్పుడు వచ్చిన మాదిగ పెద్దలు మాదిగ విధ్యార్ధులు మహిళలు యువకులు మర్రిపాడు మండలం నుండి వేలాది మంది ఆ సభకు తరలి వచ్చేవిధంగా మాదిగలు సిధ్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ మండల అధ్యక్షులు నల్లపోగు అడివయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధిగా కొప్పాల వెంకటయ్య మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి కుంటా మళ్ళికార్జున మాదిగ,మండల ఉపాధ్యక్షులుగా పల్లవాలు అనిల్ మాదిగ, యర్రబల్లి ప్రసాద్ మాదిగ, కార్యదర్శిగా గుర్రాల పెంచలయ్య మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులుగా నల్లిపోగు అంకయ్య మాదిగ, ఎంఎస్పీ మండల అధికార ప్రతినిధి కన్నెమరకల తిరుపతి మాదిగ,ప్రధాన కార్యదర్శి కోళకాని రాజశేఖర్ మాదిగ,ఉపాధ్యక్షులుగా నల్లిపోగు విల్సన్ మాదిగ,కార్యదర్శిగా పుత్తూరు ప్రసాద్ మాదిగ,కాలేపల్లి రామయ్య మాదిగలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మహిళా ఇన్చార్జీ గేరా జానకి మాల,ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జీ గడ్డం ఆదినారాయణ మాదిగ, ఎంఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు వడ్లపల్లి రమణమ్మ మాదిగ, ఎంఎస్పీ సీరియర్ నాయకులు తాటిపర్తి లక్ష్మయ్య మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు సోంపల్లి హజరత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మంద నరేంద్ర మాదిగ, మండలంలో అన్ని గ్రామాల మాదిగ పెద్దలు,యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
