జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల గ్రామం ఎల్లమ్మ దేవస్థానం నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి పాత బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి దేవాలయం పై వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి చేశామని అన్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఎల్లమ్మ దేవాలయాన్ని నేడు ఓ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎండోమెంట్ కలపడం పై మండిపడ్డారు. అధికారులు స్వాధీన పట్టించుకోవడంతో గ్రామంలోని ఉపాధి కోల్పోతారని వెంటనే ఎండోమెంట్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో ఉలినం చేయవద్దంటూ నిరసన తెలిపి బైఠాయించారు. ప్లా కార్డులు పట్టుకొని ఎండోమెంట్ అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి,( డీఏఓ) డివిజనల్ అడ్మినిస్ట్ ఆఫీసర్ వసంతలు, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు సుమారు గంట వరకు ఇబ్బందులు పడ్డారు.