కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్ నగర్: హైదరాబాదులో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (TUWJ -IJU) కాగజ్ నగర్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కు వినతి పత్రం అందజేశారు.
మీడియా ప్రతినిధుల పై దాడికి పాల్పడ్డ మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి , రౌడీషీట్ ఓపెన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు జర్నలిస్టులకు భద్రత లేకుండా పోతుందని జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం రూపొందించాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వెంకన్న, సతీష్, రతన్, ముఖషిర్, నవాజ్, తదితరులు పాల్గొన్నారు