నిర్మల్ జిల్లా : ముధోల్ నియోజకవర్గం బాసర పట్టణ కేంద్రంలోని జీఎస్ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ఏడాది విజయోత్సవ సభ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి దానసరి అనసూయ (సీతక్క) తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ది పాలన జరుగుతుందన్నారు.ప్రతి ఒక్క నియోజకవర్గంలో పేదల అభ్యున్నతి కోసం ప్రతిక్క కాంగ్రెస్ కార్యకర్త పని చేస్తున్నారని అన్నారు. రానున్న ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చెయ్యాలని సూచించారు. అనంతరం బాసర ఐఐటి లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు ,ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ,ఎమ్మెల్సీ బాల్మ్యూరి వెంకట్ ,ముధోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నారాయణ రావు పటేల్ , కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగునక్క ,గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ఛైర్మెన్ తిరుపతి ,రాష్ట్ర టిపిసిసి జనరల్ సెక్రటరీ,కరీంనగర్ జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ సత్తు మల్లేష్ మరియు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
