పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పరిధి చిన్న జగ్గంపేట గ్రామంలో జగ్గమ్మచెరువు నీటి సంఘం అధ్యక్షునిగా సారిపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా చందక సత్యవతి, డైరెక్టర్లుగా గోపి నాగేశ్వరరావు, గారపాటి శ్రీను, గాది అమ్మాజీ, మొగలికొల్ల వెంకటరమణలను కూటమి పార్టీల తరపున ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. నియమితులైన వారికి కూటమి పార్టీ నాయకులు శాలువ కప్పి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సారిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ రైతన్నలే ఈ దేశానికి వెన్నుముక్క అని, రైతులకు ఏ కష్టం వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మొగిలి అప్పారావు, ఇసరపు శ్రీను, టిడిపి నాయకులు శీరం సత్తిబాబు, మొగలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.