- దేవరకద్ర ఇసుక మాఫియాపై….ఎస్పీ, కలెక్టర్ లకు ఫిర్యాదు
- ఇసుక మాఫియాని అరికట్టాలని వినతి
- ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటాం
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామ శివార్లో గల వాగు నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నేనుసైతం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా వెంకటాపల్లి గ్రామ శివారులోగల వాగు నుండి పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇసుక మాఫియా ఇసుకను అక్రమంగా తరలిస్తుందని, స్థానిక దేవరకద్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రైతులు మ్యాకల ఆంజనేయులు, రామస్వామి, వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఈ విషయమై డయల్ 100 కు ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. డయల్ 100 కు ఫిర్యాదు చేస్తే దాదాపు రెండు, మూడు గంటల తర్వాత వచ్చే దేవరకద్ర పోలీసులు ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోకుండా, అదే మాఫియాతో కుమ్ముకు అవుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయమై మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకికి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిలకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అంతేకాకుండా ఇసుక మాఫియా తమకు అడ్డు వస్తున్ననని బాధిత రైతు మ్యాకల ఆంజనేయులుపై దాడి చేసి ఆయన కాళ్ళను విరగొట్టడం జరిగిందని వారు తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాను ఆపాలని పాము పోరాటం చేస్తుంటే తమను కూడా బెదిరిస్తున్నారని రైతు రామస్వామి ఆందోళన చేశారు.
దీంతో చేసేదేమీ లేక సోమవారం మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా ఇసుక మాఫియాకు స్థానికంగా కొందరు పోలీసులు, రెవిన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని వారు విమర్శించారు. ఇకనైనా జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇసుక మాఫియాపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త, నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిద్ది ప్రవీణ్ కుమార్ తెలిపారు.