పిఠాపురం : కాకినాడ జిల్లా మాల సంఘాల జెఎసి అభ్యర్థులు లింగం శివప్రసాద్, బుంగా సతీష్ కుమార్, నీతి సుబ్రమున్నం, బీఎస్పీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు, అడబాల గురునాదంలు మాట్లడుతూ గుంటూరులో జరిగిన మాలల మహా గర్జనను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను. విజయ వంతం చేసిన ప్రతీ మాల సోదరులకు పేరు పేరునా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు. అందరు కలిసి ఏలా విజయవంతం చేసారో ముందు ముందు జరిగే అన్ని కారక్రమాలను అలానే కలిసి పని చేసి మన హక్కులకు పోరాటం చేయాలని పోరాటం ద్వారానే మన హక్కులను మన రాజ్యాంగాన్ని కాపాడు కోగలమన్నారు. అదే విధంగా ఈ నెల 19వ తేదీన కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీసు వనమ్యాన్ కమిషన్ విచ్చేస్తుంది కాబట్టి వర్గీకరణకు ఏర్పాటు చేసిన కమిషన్ ను గో బ్యాక్ కమిషన్ అంటూ నిరసన తెలియపర్చాలని అందుకోసం జిల్లా నలుములులనుండి మాలలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మాల జెఎసి నాయకులు కోరారు. మాల సోరులందరు 19వ తేదీన ఉదయం 10 గంటలు కలెక్టరేట్ వద్దకు చేరుకోవాలని కోరారు.