కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు కీలక ప్రాంతాలను రెడ్‌జోన్ పరిధిలోకి చేర్చింది. చందానగర్, కోకాపేట, తుర్కయంజాల్, కొత్తపేట ప్రాంతాలను రెడ్‌జోన్‌లో చేర్చిన ప్రభుత్వం ఈ ప్రాంతాల వారు వంద శాతం ఇళ్లకే పరిమితం కావాలని నిర్దేశించింది. పద్నాలుగు రోజులపాటు వీరు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, నిత్యావసరాలు కావాలంటే వారి ఇళ్లకే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.