contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్టేషన్లను తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ

వెల్దుర్తి (తూప్రాన్)  :  వార్షిక తనీఖీల్లో భాగంగా చిన్న శంకరంపేట, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఈ రోజు తనీఖీ చేసారు.  తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును, రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు,  నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను గురించి ఆయా సబ్ ఇన్స్ స్పెక్టరు లను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పరిశీంచారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు . నేరాల కట్టడి కొసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే స్టేషన్‌ అధికారులు వేగంగా స్పందించాలని చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని  ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, ముందస్తూ సమాచార సేకరణ అవసరమని, బ్లూ క్లోట్స్ సిబ్బంది డయాల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు. వారి తో అక్కడ పరిస్థితి కంట్రోల్ కానప్పుడు వెంటనే ఎస్ఐకి, సిబ్బందికి సమాచారం అందించి వెంటనే పిలిపించుకోవాలన్నారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది విజిబుల్ పోలిసింగ్ నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. అలాగే సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ ల పరిదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల వల్ల నేరాలు నియంత్రించవచ్చని ఒక్క సీసీ కెమేరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వయంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను పరిశీలించి సిబ్బంది కి పలు సూచనలు చేసినారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ .వెంకట్ రెడ్డి, రామాయంపేట సీఐ .వెంకట రాజాగౌడ్ గౌడ్ , శంకరంపేట ఎస్సై  నారాయణ, తూప్రాన్ సీఐ రంగ కృష్ణ , వెల్దుర్తి ఎస్సై రాజు , సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :