ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమా దాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అన్నారు. నరసరావుపేట ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా పోలీసు ప్రధాన కార్యాలయం వరకు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. వాహనం నడిపేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు తెలిపారు.
ఈ ర్యాలీ కార్యక్రమంలో నందు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అడ్మిన్ ఎస్పీ సంతోష్, నరసరావు పేట డీఎస్పీ నాగేశ్వర రావు ,నరసరావు పేట ట్రాఫిక్ సిఐ లోకనాథం, నరసరావుపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.