- అధ్యక్షుడిగా జోరిగే శ్రీనివాస్
- ప్రధాన కార్యదర్శిగా తరి రాజశేఖర్.
జగిత్యాల , కోరుట్ల : ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పాత్రికేయుల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లుగా జర్నలిస్టు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని టీ ఎస్ జే యు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు.టి ఎస్ జే యు కోరుట్ల నియోజకవర్గ కమిటీ ఎన్నిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ అధ్యక్షతన మెట్ పల్లి విఆర్ఎం గార్డెన్స్ లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ … 10 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, అక్రిడేషన్ల కమిటీలు పునరుద్ధరణ చేసి జర్నలిస్ట్ లందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనికోరారు. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్ట్ సంక్షేమ పథకాలను జర్నలిస్టుల అందరికీ అందేలా చూడాలని తెలిపారు . రాబోయే అక్రిడేషన్ కమిటీలలో అన్ని జర్నలిస్టు సంఘాలకు భాగస్వామ్యం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా ధీకొండ మురళి, అధ్యక్షుడు జోరిగే శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి తరి రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా పఠాన్ ఫిరోజ్ ఖాన్, పింజారి శివ, కోశాధికారి ఓంకారి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకిర్ హుస్సేన్, బోడ దివాకర్, సహాయ కార్యదర్శి నరేష్, మీడియా ఇంచార్జ్ నన్నాపు రవిరాజ్, ఈసీ మెంబెర్లు పండిత్ రాజేందర్, గట్ల శ్రీనివాస్, గణేష్, సయ్యద్ ఫిరోజ్, సభ్యులు గుండవేణి రమేష్, సునీల్, నాగేష్, హరీష్, రవీందర్, సీనియర్ పాత్రికేయులు గాజుల మహేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.