అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో పాత సచివాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్ గుత్తి తాసిల్దార్ ఓబులేసుకు గ్రామ ప్రజలు పూలమాలలు వేసి దుశ్యాలవాలతోసన్మానించారు. అంతకుమునుపు సదస్సులో భూ సర్వే నంబర్లు మార్పు, భూమి కొలతల్లో తేడాలు, ఇంటి నివేశ స్థలాలు, ఇళ్ల మంజూరు కోసం ప్రజలు భారీ ఎత్తున వినతి పత్రాలు సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ గురు మస్తాన్ హౌసింగ్ ఏఈ శివశంకర్ వీఆర్వోలు సురేంద్ర, రమేష్ టిడిపి నాయకులు నాగేపల్లి సూరి, బోయ సుధాకర్ ,చంద్ర ,స్టోర్ డీలర్ సూరి తదితరులు పాల్గొన్నారు