సంగారెడ్డి జిల్లా అందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు వెంటనే పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
అందులో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. విద్యార్థులు తమ సమస్యను వివరించగా, జిల్లా అదనపు కలెక్టర్ ఆ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే పరిష్కారం చేపడుతామని వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, కలెక్టర్ సూచన మేరకు అందోల్ ఆర్డిఓ పాండు, టౌన్ సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ విష్ణు సాగర్ తదితరులు విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం పాఠశాలలో హాజరయ్యారు.