విజయనగరం జిల్లా, బొబ్బిలి: పట్టణంలో గల వైస్సార్ కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం బొబ్బిలి మాజీ శాసన సభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనహృదయా నేత,పేద,బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతీ పేదవాడు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో పరిపాలన అందించారని తెలిపారు.పేదింటి పెద్ద కొడుకుగా, అవ్వ, తాతల ముద్దు బిడ్డగా, అడపడుచుల్లో అన్నగా, విద్యార్థులకు మేనమమగా,రైతులపాలిటీ ఆపద్బాంధవుడిగా, ప్రజా సంక్షేమ సారథి గా, రాజశేఖర్ రెడ్డి ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని చిరునామాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని పేర్కొన్నారు.