నెల్లూరు జిల్లా ఆత్మకూరు : పేద ప్రజలకు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఐదేళ్ల పాటు సువర్ణ పాలన అందించాలని, మాటకు కట్టుబడే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగులకు, పండ్లు, బ్రెడ్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.ఆయన పాలనలో అన్ని వర్గాలప్రజలు సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా సుపరిపాలన అందించిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారన్నారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రస్తావన ఒక చరిత్ర అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరికో దర్శంగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, సంగం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ సొసైటి మాజీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, నోటి వినయ్ కుమార్ రెడ్డి, ముడి మల్లికార్జున, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, సూరి మదన్ మోహన్ రెడ్డి, వెంగళరెడ్డి,బాలచంద్రారెడ్డి, సురేంద్రరెడ్డి, బాల అంకయ్య, సర్పంచ్ వెంకటేశ్వర్లు, నాయబ్, శ్రీనివాసులునాయుడు, హరిబాబు, మణి, జమ్రు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.