నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను మండల వైసిపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల వైసిపీ పార్టీ కార్యాలయం నందు అభిమానులు , కార్యకర్తలు కేకును కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటనికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల వైసిపీ మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ ప్రజల మనసులో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అంతతి ప్రజభిమానాన్ని చురగొన్న నేత ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు. గత ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమిగా కలిసొచ్చి పోటీ చేసి గెలిచినా వైసిపి పార్టీకి 40% ఓటింగ్ వచ్చిందని తప్పుడు హామీలతో ప్రజలను మైమరచి పదవి కోసం మూడు పార్టీల కుమ్మక్కై వైసిపి పార్టీపై గెలిచాయని అన్నారు. ప్రజలకు సంక్షో పథకాలు అందజేయడంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు సాటి రారని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో చాలా చోట్ల అమలు అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండలం వైసిపి కన్వీనర్ బొర్ర సుబ్బిరెడ్డి, ఎంపీటీసీ అజరత్ రెడ్డి, తిక్కవరం గ్రామ సర్పంచ్ బాబు, వైసిపి యువ నాయకులు చండ్ర నారాయణస్వామి, పొంగూరు సుధాకర్, గౌస్ బాషా, ఫైరుద్దీన్ వివిధ గ్రామాల వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.