నెల్లూరు జిల్లా, ఆత్మకూరు : అంబేద్కర్ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ నిరసన ధర్నా చేపట్టారు.. ప్రపంచం మొత్తం అంబేద్కర్ సిద్ధాంతాలను కొనియాడుతూ ఉంటే దేశంలోని అధికార పార్టీ సాక్షాత్తు పార్లమెంటులో అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడడం చాలా సిగ్గుచేటని వెంటనే కేంద్ర మంత్రి అమీషా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఆత్మకూర్ సిపిఎం పార్టీ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు … రాజ్యాంగాలను మార్చి వేయాలని , అంబేద్కర్ సిద్ధాంతాలను రూపుమాపాలని మను ధర్మాన్ని దేశంలో ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఇటువంటి ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ నేతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిపిఎం పార్టీ నేతలు లక్ష్మీపతి ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందని, నాగేంద్ర,ఆవాజ్ కమిటీ రాష్ట్ర నేత యస్ధాని, ఐద్వా మహిళా నాయకురాలు గుల్జార్ బేగం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు..