తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఎ.మొహిద్దీన్ భాష ఆధ్వర్యంలో గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ గణిత శాస్త్ర అభివృద్ధిలో భారతీయులైన ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్ కృషి విశేషమైనది అన్నారు. ఆధునిక పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే గణితం పై పట్టు సాధించడం తప్పనిసరి అన్నారు. గణిత అధ్యాపకురాలు డాక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రపంచానికి “సున్నా” ను పరిచయం చేసిన ఘనత భారతీయులధే అన్నారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి అంకెలతో లెక్కలతో అవసరం ఉటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈశ్వర్ బాబు, అధ్యాపకులు మాశిలామనణి, రేఖ, విష్ణు ప్రియ విద్యార్థులు పాల్గొన్నారు.