తిరుపతి జిల్లా పాకాల మండలంలో బుధవారం ప్లాటినం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ను పాకాల బాలికల జూనియర్ కాలేజీ లో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ వైద్య కళాశాల మరియు హాస్పిటల్ చిత్తూరు వారి సహకారంతో డాక్టర్ రమేషు, డాక్టర్ తులసి మొదలగు వైద్య బృందం ద్వారా 125 మంది డయాబెటిక్, బిపి, కీళ్ల నొప్పులు ,మలబద్ధకం, పక్షవాతం,మరియు, నరాల సంబంధిత వ్యాధులను పరీక్షించి వారికి అవసరమైన రెండు లక్షల రూపాయలు విలువగల ఆయుర్వేదిక్ మందులను ఉచితముగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ పాకాల ప్లాటినం అధ్యక్షులు తులసీరామన్, కార్యదర్శి ఆర్ వి ప్రసాద్ , లైన్ గురుస్వామి నాయుడు, లైన్ కుప్ప స్వామినాయుడు, జయరాం నాయుడు, దొరస్వామి నాయుడు, డి సీ రామయ్య, డిసి కేస్ మస్తాన్, జై యన్ బాలాజీ, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
